విశ్వంభర వస్తున్నాడు... సెప్టెంబర్ 18న విడుదలకు మేకర్స్ సన్నాహాలు..

విశ్వంభర వస్తున్నాడు... సెప్టెంబర్ 18న విడుదలకు మేకర్స్ సన్నాహాలు..

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌‌‌‌  కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సోషియో-ఫాంటసీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌కు ఎక్కువ సమయం తీసుకున్నారు మేకర్స్. ఈ వర్క్ దాదాపు పూర్తవడంతో రిలీజ్ డేట్‌‌‌‌ అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారట. దసరా సెలవులు ఈ సినిమాకు కలిసొచ్చేలా ఈ డేట్‌‌‌‌ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరికొన్ని రోజుల్లోనే ఈ రిలీజ్ డేట్‌‌‌‌పై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రానుంది. ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ గ్లింప్స్, సాంగ్  ఇతర ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌కు  మంచి  రెస్పాన్స్ వచ్చింది. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.