
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ఫేమ్ వశిష్ఠ మల్లిడి రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో VFX కారణంగా రిలీజ్ పోస్ట్పోన్ అవుతూ వస్తోంది.
లేటెస్ట్గా (ఆగష్టు 21న) చిరంజీవి విశ్వంభర రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు చిత్రం బృందం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఇన్నాళ్లు సినిమా ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చిరంజీవి వెల్లడించారు.
రేపు (ఆగష్టు 22న) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా చిరు సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘‘ ఇలా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణం ‘విశ్వంభర’. చాలామందికి అనుమానం ఉంది. విశ్వంభర ఎందుకు ఆలస్యమవుతుందని. ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సెకండ్‌హాఫ్ మొత్తం VFX, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్యుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం.
‘విశ్వంభర’గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమా ఒక అద్భుతమైన కథతో వస్తుంది. చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ క్రమంలో మూవీ గ్లింప్స్‌ను ఇవాళ (ఆగస్టు 21) సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తున్నాం. విశ్వంభర అందరికీ ఇష్టమైన 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఎంజాయ్ చేయండి’’ అని చిరంజీవి వీడియో ద్వారా తెలిపారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్ ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ రానుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.