
మహేష్ బాబుని అందరూ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. తనతో కలిసి మెగాస్టార్ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ మాట వింటేనే ఇరువురి అభిమానులకీ ఉత్సాహం వచ్చేస్తుంది. ఇది నిజంగానే జరగబోతోంది. ఈ టాప్ స్టార్స్ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. జనవరి 5న జరిగే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ విషయం గురించి మహేష్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వెలిబుచ్చాడు.
‘మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమా ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్‌కి రావడానికి అంగీకరించినందుకు చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సినిమా ఫంక్షన్‌కి మీరు రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. మా యూనిట్ ఈ ఫంక్షన్‌ను ఓ ల్యాండ్ మార్క్ ఈవెంట్‌గా సెలెబ్రేట్ చేసుకుంటుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను సర్’ అన్నాడు ప్రిన్స్. భారీ అంచనాలనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ వస్తారనే వార్త వింటే వారి ఆనందం రెట్టింపవడం ఖాయం.