
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమయ్యింది. బుధవారం(జూన్ 12) రోజున నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. అమరావతి వేదికగా ఘనంగా జరుగనున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ గా హాజరుకానున్నారు.
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆయనకీ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా.. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు(జూన్ 11) సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడ చేరుకుంటారని సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ తోపాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ (Ram Charan) హాజరుకానున్నారట.
ఇక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం విషయానికి వస్తే.. బుధవారం(జూన్ 12) ఉదయం 11.27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.