బీఏ రాజు మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

V6 Velugu Posted on May 22, 2021

ప్రముఖ నిర్మాత బీఏ రాజు మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా సినమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన బీఏ రాజు లాంటి వారు ఉండటం సినీ పరిశ్రమకు అదృష్టమన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి వ్యక్తి లేనడే వార్త విని షాక్ కు గురయ్యానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బీఏ రాజు అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు మహేశ్ బాబు.ఆయనతోఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణిస్తున్నానని... తన చిన్న తనం నుంచి ఆయన తెలుసన్నారు. బీఏ రాజు మృతి సినీ ఇండస్ట్రీకే కాకుండా తమ కుటుంబానికి పెద్ద లోటన్నారు. రాజు ఆకస్మిక మరణంతో షాకయ్యనన్నారు ప్రభాస్. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేశానన్నారు. ఆయన మృతి టాలీవుడ్ కు లోటన్నారు.

బీఏ రాజు అకాల మరణం షాక్ కు గురిచేసిందన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఆయనతో పరిచయముందన్నారు.బీఏ రాజు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.ఎంతో మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందన్నారు.

 డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, శ్రీనువైట్ల, నటుడు ప్రకాశ్ రాజు, నాని, విశాల్, కళ్యాణ్ రామ్,నాగశౌర్య బీఏ రాజు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.  

Tagged Chiranjeevi, Mahesh babu, rajamouli celebs tribute to BA raju dies

Latest Videos

Subscribe Now

More News