ఇండ్ల కేటాయింపు మా చేతిలో లేదు

ఇండ్ల కేటాయింపు మా చేతిలో లేదు
  • మెడికల్ కాలేజీలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వడంపై వివరణ కోరుతాం
  • గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్

హైదరాబాద్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మాత్రమే గృహ నిర్మాణ శాఖ పరిధిలో ఉందని, వాటిని ఎవరికి కేటాయించాలన్నది తమ చేతిలో లేదని శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్ చెప్పారు. సిద్దిపేట, నల్గొండల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను మెడికల్ కాలేజీ హాస్టళ్లకు ఇవ్వడంపై ‘వెలుగు’ పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారుల నుంచి వివరణ కోరుతామని చిత్రా రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, లక్ష ఇండ్లు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ పలు జిల్లాల్లో దళారులు సొమ్ము వసూలు చేస్తున్న విషయంపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. అందుబాటులోకి వస్తున్న ఇండ్ల సంఖ్య వేలల్లో ఉండగా.. లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారని పేర్కొన్నారు.