నల్లగొండ జిల్లాలో కబేళాకు తరలిస్తు్న్న గోవులను పట్టుకున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో 65 జాతీయ రహదారిపై తనఖీలు చేసిన పోలీసులు రెండు డీసీఎంలలో తరలిస్తున్న గోవులను గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు ఈ గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు డీసీఎంలలో 27 గోవులను హైదరాబాద్ లోని కబేళాలకు తరలిస్తున్నారు. గోవులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న చిట్యాల పోలీసులు.. గోవులను గోశాలకు తరలించారు.
