Anasuya Bharadwaj: పాతతరం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసంరం లేదు- అనసూయ భరద్వాజ్

Anasuya Bharadwaj: పాతతరం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసంరం లేదు- అనసూయ భరద్వాజ్

నటిగా, యాంకర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, సోషల్ మీడియా వేదికగా నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ధరించే దుస్తుల గురించి లేదా ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంటుంది. అయితే ఇటీవల హీరోయిన్స్ వస్త్రాదారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ సెలబ్రిటీలు, మహిళలు సీరియస్ అయ్యారు. దీంతో తాను మాట్లాడిన అన్ పార్లమెంటరీ పదాలకు శివాజీ క్షమాపణ చెప్పారు.

శివాజీ  ప్రెస్ మీట్‌లో క్షమాపణలు చెబుతూనే మళ్ళీ తన పాత మాటలకే కట్టుబడి ఉండటాన్ని అనసూయ తప్పుబట్టారు.  శివాజీ గారు చాలా ఇన్సెక్యూర్ గా ఉన్నారని అనసూయ నిన్న ( బుధవారం , 24న ) మండిపడ్డారు. హీరోయిన్లుగా మా బాధ్యతలు ఏంటో, మా హక్కులు ఏంటో మాకు తెలుసు. మాకు డ్రెస్సింగ్ గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అనసూయ కౌంటర్ ఇచ్చారు.

వయసును అడ్డం పెట్టుకుని వేధిస్తారా?

లేటెస్ట్ గా మరో సారి సోషల్ మీడియా వేదికగా  ట్విట్ చేశారు  అనసూయ .  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది..

పాత ఆలోచనలు పక్కన పెట్టండి..

ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదు. అంతే కాకుండా మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం సమంజసం కాదు  అంటూ సోషల్ మీడియాలో రాసుకోచ్చింది అనసూయ. ప్రస్తుత ఈ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది..