మక్కలను మద్దతు ధరకు అమ్ముకోవాలి: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మక్కలను మద్దతు ధరకు అమ్ముకోవాలి:   చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు: రైతులు ఆరుగాలం పాటు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం కల్పించే మద్దతు ధరపై అమ్ముకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. చొప్పదండి సొసైటీ ఆధ్వర్యంలో జువ్వాడి చొక్కా రావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కజొన్న పండించిన రైతులు నష్టపోవద్దని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి ప్రభుత్వ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించామన్నారు. ఏఎంసీ చైర్మన్​ కొత్తూరి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైస్​చైర్మన్​రాజేందర్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ వడ్లూరి సరిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కార్యదర్శి రాజేశ్వరి, పాల్గొన్నారు.

గంగాధర, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలకు ప్రత్యేక గుర్తింపునిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల, కురిక్యాల, మధురానగర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉప్పరమల్యాలలో కొండగట్టు దేవాలయం నుంచి వచ్చిన పట్టువస్త్రాలను ఉత్సవమూర్తులకు అందజేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్పంచులు పాల్గొన్నారు.