చొప్పదండి, వెలుగు : చొప్పదండి నవోదయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న పి.రిత్విక్‌రెడ్డి జపాన్ లో జరిగే సకురా సైన్స్ ప్రాజెక్ట్‌కు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ పి.మంగతాయారు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఇంటర్ సెకండియర్చదువుతున్న 660 స్టూడెంట్ల నుంచి 20 మంది మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగ్గా
అందులో కరీంనగర్ జిల్లా చొప్పదండి నవోదయ విద్యాలయ విద్యార్థి రిత్విక్ ఎంపికైనట్లు చెప్పారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జపాన్‌లో వివిద విద్యాలయాలు, యూనివర్సిటీలు, సైన్స్ పరిశోధనా కేంద్రాలను సందర్శించి ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటాడని తెలిపారు.