రికార్డులు బద్దలు కొడుతున్న ‘చోర్ నికల్ కే భాగా’

రికార్డులు బద్దలు కొడుతున్న ‘చోర్ నికల్ కే భాగా’

ఓటీటీ కంటెంట్ ను ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ ఫ్లాట్ ఫాం క్రియేటర్లకు గొప్ప అవకాశాలను కల్పిస్తోంది.  ఇందులో నటించడానికి స్టార్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఇలా విడుదలైన ఓ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. అత్యధిక మంది వీక్షణలు ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం ఇది వెనక్కి నెట్టింది. ఆద్యంతం ట్విస్టులతో సాగుతూ ఆకట్టుకుంటోంది. 

ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ప్రకటిస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేసింది. ‘చోర్ నికల్ కె భాగా’ అనే చిత్రం 29 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాలా అనే సినిమాల పేరిట ఉండేది. ఈ థ్రిల్లర్ సినిమాను అజయ్ సింగ్ రూపొందించాడు. యామీ గౌతమ్, శరద్ కేల్కర్, సన్నీ కౌషల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అల్లు శిరీష్ ‘గౌరవం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది యామీ గౌతమ్. ఈ సినిమాలో ఆమె నటన విమర్శల ప్రశంసలందుకుంటోంది. 

https://twitter.com/MaddockFilms/status/1643864631067443200