
కొడంగల్, వెలుగు: కొడంగల్మెడికల్కాలేజీ నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా అధికారులను ఆదేశించారు. బుధవారం తాండూర్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొడంగల్ మెడికల్ కాలేజీని కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి ఆమె పరిశీలించారు. తాత్కాలిక కాలేజీకి కూడా సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్‌ను సందర్శంచి రికార్డులను పరిశీలించారు.
అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారా? ఆరా తీశారు. రోగుల సౌకర్యం హాస్పిటల్‌కు కావాల్సిన పరికరాల వివరాలను వైద్యులను అడిగారు. సబ్‌కలెక్టర్ ఉమా శంకర్‌ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, కడా స్పెషల్ఆఫీసర్వెంకట్ రెడ్డి, జీజీఎచ్ మాలతీ, సూపరింటెండెంట్ సునీత, తహసీల్దార్ తార సింగ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహరెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ రాజు ఉన్నారు.