క్రిస్మ‌స్ టూర్లతో ఒమిక్రాన్ వ్యాప్తి

క్రిస్మ‌స్ టూర్లతో ఒమిక్రాన్ వ్యాప్తి

క్రిస్మ‌స్ పండుగ వేళ చాలా మంది టూర్లు వెళ్తుంటారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ మ‌రింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశముందని  అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ తెలిపారు. అసాధార‌ణ‌రీతిలో ఒమిక్రాన్ వ్యాపిస్తుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోందన్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారి వేళ అమెరికా ప్ర‌భుత్వానికి ఆంథోనీ ఫౌచీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరును గ‌మ‌నిస్తే అది దేశ ఆరోగ్య‌సేవ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ ఇప్పుడున్న ప‌రిస్థితులే కొన‌సాగితే ఆస్పత్రులపై మ‌రింత ప్రెష‌ర్‌ పెరుగుతంద‌న్నారు. ప్ర‌జ‌లంతా మాస్క్‌లు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించడంతో పాటు ..వ్యాక్సిన్లు, బూస్ట‌ర్ డోసులు తీసుకోవాల‌ని కోరారు.

వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి