నా కొడుకునే తిడతారా.. కాలేజీలో సీఐ రచ్చ రచ్చ.. చీటింగ్ను ప్రశ్నించినందుకు ఆఫీస్ ధ్వంసం..

నా కొడుకునే తిడతారా.. కాలేజీలో సీఐ రచ్చ రచ్చ.. చీటింగ్ను ప్రశ్నించినందుకు ఆఫీస్ ధ్వంసం..

పుత్ర ప్రేమ ఇంత గుడ్డిగా ఉన్నందుకేనేమో.. టీనేజర్లలో, విద్యార్థుల్లో చెడు అలవాట్లు ఎక్కువవుతున్నాయి. తప్పు చేసిన విద్యార్థిని మందలించి దారిలో పెట్టడం ఒక టీచర్ బాధ్యత. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా తయారైందంటే.. నా కొడుకు ఏం చేసినా మూసుకుని ఉండండి.. వాడు అలాగే చేస్తాడు.. అన్నట్లుగా పేరెంట్స్ ధోరణి ఉంటోంది. దీంతో.. అటు ఇంట్లో భయం లేక, స్కూల్, కాలేజీల్లో భయం లేక పెడదారిని పడుతున్న విద్యార్థులు ఎందరో.

డెహ్రాడూన్ లో ఒక పోలీసులు అధికారి చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కొడుకును మందలించారని పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి నానా రచ్చ చేసి వార్తల్లో నిలిచారు సీఐ. జూన్ 5న ఎక్జామినేషన్ కంట్రోల్ రూమ్ కు నలుగురు సహచరులతో ఎంటరైన సీఐ.. నానా రభస చేసి.. ఫర్నిచర్ ధ్వంసం చేసి స్టాఫ్ ను బెదిరించారు. 

కాలేజీ స్టాఫ్ చెప్పిన వివరాల ప్రకారం.. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కబీర్ కంద్వాల్..  సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో కాపీ కొడుతూ జూన్ 4న పట్టుబడ్డాడు. మందలించిన టీచర్లు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. 

జూన్ 5న కబీర్ తండ్రి, సీఐ మహేష్ కంద్వాల్.. పరీక్షల కంట్రోల్ రూమ్ కు వెళ్లి.. దాడికి దిగాడు. స్టాఫ్ పైన చేయి చేసుకున్నారు.. ఆఫీస్ ను ధ్వంసం చేశారు.. టీచర్లను బెదిరించారు. నలుగురు స్టాఫ్ గాయాలపాలయ్యారని ప్రిన్సిపల్ చెప్పారు. ఈ ఘటనపై పోలీస్ డిపార్టుమెంటులో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. 

శనివారం (జూన్ 06) కాలేజ్ ఫ్యాకల్టీ పెద్ద ఎత్తన ఆందోళన నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి.. నిస్సక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ ఘటనలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. బాద్యతాయుతమైన సీఐ పదవిలో ఉన్న వ్యక్తి.. రౌడీలా వ్యవహరించడంపై ఆగ్రభించిన ఎస్ఎస్పీ ప్రమేంద్ర దోబాల్.. సదరు సీఐని సస్పెండ్ చేసి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కు అటాచ్ చేశారు. 

సీఐ పెట్టిన కేసులో.. తన కొడుకు కాపీ కొడుతున్నట్లు చెప్పిన స్టాఫ్.. ఒక రూమ్ లో గంటల తరబడి ఉంచారని పేర్కొన్నాడు. రూమ్ లో బంధించి తీవ్రంగా దాడి చేసినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ కౌంటర్ కంప్లైట్ చేశారు.