
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘సర్కిల్’. ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో అనేది ట్యాగ్ లైన్. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహత, రిచా పనై, నైనా, పార్థవ సత్య తదితరులు లీడ్ రోల్స్ పోషించారు . ఆరా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 7న రిలీజ్ చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఒక ఫొటోగ్రాఫర్ జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. తన జీవితంలో శత్రువులెవరో, మిత్రులెవరో తెలియని సందిగ్ధంలో హీరో ఏం చేశాడనేది కాన్సెప్ట్. పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు దర్శక నిర్మాతలు.