రోడ్డు ప్రమాదంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ మృతి ..

రోడ్డు ప్రమాదంలో  సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ మృతి ..

రోడ్డు ప్రమాదంలో  సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మృతి చెందారు. 2023, నవంబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం తిరుపతి విమానాశ్రయం నుంచి  శ్రీధర్ బుల్లెట్ వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. రేణిగుంట రోడ్డులో కళాంజలి షోరూం వద్ద లక్ష్మీపురం సమీపంలో ఫ్లైఓవర్ పై అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీధర్ ను స్థానికులు వెంటనే చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన శ్రీధర్.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.  తిరుపతిలోని ముత్యాలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ కు భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ (సిఐఎస్ఎఫ్) విభాగంలో 2018 నుండి సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన శ్రీధర్.. ఇక్కడే ప్రమోషన్ పొంది, ఆరు నెలల క్రితం తిరుపతి విమానాశ్రయానికి పోస్టింగ్ పై వెళ్లారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో శ్రీధర్ మృతి చెందడంపై శంషాబాద్ విమానాశ్రయంలో అతనితో పాటు విధులు నిర్వహించిన సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరమని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.