
హైదరాబాద్, వెలుగు: ఇల్లు, ఆఫీస్ నీట్‌గా అందంగా కనిపిస్తే ఆ హాయే వేరు. మైండ్ ఎంతో రిలీఫ్ అయిపోతుంది. అలాగే టెన్షన్ కూడా చాలా వరకూ తగ్గుతుంది అంటున్నారు సైకాలజిస్టులు. ఈ క్రమంలో చాలామంది ఇంటీరియర్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బెడ్రూం, కిచెన్, చిల్డ్రన్ రూమ్ ను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. సిటీలో రోజురోజుకి కొత్త అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు పెరిగిపోతున్నాయి. మంచి ఏరియాలో ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ ఇల్లు తీసుకునే విషయంలో ఎంత కేరింగ్ గా ఉంటున్నారో.. కొన్న తర్వాత ఇంటీరియర్ పై కూడా అదేవిధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు తమకు నచ్చినట్టుగా ఇంటిని డిజైన్ చేసుకునే వారి సంఖ్య పెరిగింది. కొత్త ఇల్లు కొనుక్కునే వారు, పాత ఇంటికి రెనోవేషన్ చేయించుకునే వారు ఇంటీరియర్ కు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో డిజైనింగ్ సంస్థలకు ఆర్డర్లు పెరిగాయని ఓనర్లు చెబుతున్నారు. సిటీలో వెయ్యికి పైగా డిజైనింగ్ కంపెనీలున్నాయి. వీటికి రోజుకు పదుల సంఖ్యలో ఎంక్వయిరీలు, బుకింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా త్రీడీ ఇంటీరియర్ డెమో కోసం ఎక్కువ కాల్స్ వస్తున్నట్లు కంపెనీల ఓనర్లు చెబుతున్నారు. దీంతో పాటు ప్రొఫైల్ డోర్స్, గ్లాస్, అక్రెలిక్, హై ఎండ్ మోడల్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు.
మైండ్ సెట్ కు తగినట్లుగా..
సిటీలో ఉండే నార్త్ ఇండియాకు చెందిన వారికి కలర్ విషయంలో డిఫరెంట్ గా ఆలోచిస్తారని డిజైనింగ్ కంపెనీల ఓనర్లు చెబుతున్నారు. ప్రతి కస్టమర్ మైండ్ సెట్ కు తగినట్లుగా డిజైనింగ్ కు కోరుకుంటున్నారన్నారు. స్థానికంగా ఉండే వారు, ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి సిటీకి వచ్చి వారు టిపికల్ కలర్స్ ను ఇంటీరియర్ కోసం సెలక్ట్ చేసుకుంటున్నారని.. బెంగుళూరుతో పోలిస్తే సిటీలోనే ఇంటీరియర్ పై ఫోకస్ ఎక్కువ ఉందని కంపెనీల ఓనర్లు చెబుతున్నారు. అన్ని రకాల ఇండ్లకు సరిపోయేలా డిజైన్స్ అందుబాటులో ఉంచుతున్నామని.. కస్టమర్లకు డెమోలోనే డిజైన్స్ చూపిస్తామంటున్నారు. వన్‌బీహెచ్‌కే కు రూ. 5లక్షలు, 2 బీహెచ్‌కేకు రూ. 7 లక్షలు, 3 బీహెచ్‌కే కు రూ. 7 లక్షల నుంచి పదిలక్షలపైనే ఖర్చవుతుందని వారు చెప్తున్నారు. వన్ బీ హెచ్ కే లో ఇంటీరియర్ పూర్తి చేయడానికి 20 రోజులు, 2 బీహెచ్‌కేకు 25 రోజులు, 3 బీహెచ్‌కేకు నెల రోజులు టైమ్ పడుతుందంటున్నారు.
ఎగ్జిబిషన్లలో కొత్త మోడల్స్‌ను డిస్ ప్లే
సోషల్ మీడియా ద్వారానే చాలామంది అప్రోచ్ అవుతున్నారు. సిటీలో నెలకి రెండు లేదా మూడు ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్చర్స్ ఎగ్జిబిషన్లు కూడా జరుగుతున్నాయి. ఇందులో సిటీలోని కంపెనీలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా పార్టిసిపేట్ చేస్తారు. న్యూ మోడల్స్ ను డిస్‌ప్లే చేయడానికి, కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ఎగ్జిబిషన్లు ఉపయోగపడుతున్నాయి.
- సుధాకర్, ఓనర్, డిగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ
కొత్తింటి కోసం.. ఒక అపార్ట్‌మెంట్‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొత్తగా తీసుకున్నాం. మేం ఇదివరకు ఉన్న ఇల్లు మాములుగా ఉంటుంది. అందుకే కొత్త ఫ్లాట్‌లో మంచి ఇంటీరియర్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే డిజైన్ చేయిస్తున్నాం. - సుస్మిత, ప్రైవేటు ఎంప్లాయ్, మాదాపూర్