బిజీ లైఫ్​కు బ్రేక్ ఇస్తున్నరు .. వీకెండ్ లో లేక్ వ్యూ క్యాంపింగ్​కు సిటిజన్స్ ఇంట్రెస్ట్

బిజీ లైఫ్​కు బ్రేక్ ఇస్తున్నరు .. వీకెండ్ లో లేక్ వ్యూ క్యాంపింగ్​కు సిటిజన్స్ ఇంట్రెస్ట్
  • బిగ్ రిలీఫ్ పొందేందుకు  ఫ్యామిలీ, ఫ్రెండ్స్, యూత్​ ల వారీగా టూర్
  • సిటీ శివారులోని  రిసార్ట్స్​, క్యాంప్ ఫైర్ ల విజిట్ 
  •  ప్రకృతిని ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నరు   
  • ఫెసిలిటీస్, ఫుడ్ ను బట్టి  రేట్లు

హైదరాబాద్, వెలుగు : వీక్ అంతా ఆఫీసులో బిజీబిజీ. ఉదయం ఆఫీసుకు, సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు ట్రాఫిక్, పొల్యూషన్​ లైఫ్ తో అలసిపోయిన సిటిజన్స్​ వీకెండ్స్​లో  సేద తీరేందుకు, ప్రకృతిలో హాయిగా.. సరదాగా గడిపేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. సినిమాలు, టూర్లు, ఫంక్షన్ల వంటి వాటికి వెళ్లకుండా..  డిఫరెంట్​గా ఎంజాయ్ చేసేందుకు లేక్​ వ్యూ క్యాంప్​ఫైరింగ్ లకు వెళ్తున్నారు. కొలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సిటీ చుట్టుపక్కల ఉండే లేక్​వ్యూ రిసార్ట్స్​కు ట్రిప్ వేస్తున్నారు. క్యాంప్​​ఫైర్​లు, అడ్వెంచర్​గేమ్స్​, ట్రెక్కింగ్​, ఫన్​ యాక్టివిటీస్​, అవుట్​ డోర్​, ఇండోర్​ గేమ్స్​ఆడూతూ ఎంజాయ్​ చేస్తున్నారు. వీకెండ్ లో నేచర్ తో కనెక్ట్ అయ్యేందుకు సిటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా డిఫరెంట్ థీమ్స్​తో రిసార్ట్స్​కూడా వెలుస్తున్నాయి. 

బెస్ట్​ డెస్టినేషన్ గా మారుతుండగా..  

వీకెండ్స్ లో బయటకు వెళ్లేవారికి సిటీ శివారులోని రిసార్ట్స్​ బెస్ట్​ డెస్టినేషన్ గా మారుతున్నాయి. ఫారెస్ట్, లేక్స్,​  రిసార్టుల్లో లేక్ ​వ్యూ క్యాంపింగ్​లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఫ్రెండ్స్​తో గ్రూపులుగా వెళ్తూ ఎంజాయ్​ చేస్తున్నారు. యూత్​ను ఎట్రాక్ట్​ చేయడానికి ప్రశాంత వాతావరణంతో పాటు రకరకాల థీమ్స్ తో గేమ్స్​ను అందుబాటులో ఉంచుతున్నారు నిర్వాహకులు. అడ్వెంచర్​గేమ్స్​ను ఇష్టపడే వారికి ఏటీవీ, డిర్ట్​బైక్​,  ట్రెక్కింగ్ రోప్​ యాక్టివిటీస్ ​ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు.

ప్రకృతిలో ఎంజాయ్​ చేయాలనుకునే వారికి ఫారెస్ట్ వాక్, బర్డ్​ వాచ్, లేక్​ విజిట్ వంటి యాక్టివిటీస్​ను ఉంటున్నాయి. నైట్​ మ్యూజిక్, ఎంటర్ టైన్ మెంట్​ ప్రోగ్రామ్స్ నే కాకుండా నోరూరించే వెరైటీ ఫుడ్ కూడా అందిస్తున్నారు. వాటర్​ యాక్టివిటీస్, క్రికెట్,  టెన్నిస్​, సైక్లింగ్ లాంటి అవుట్​డోర్​ గేమ్స్​తో పాటు, ల్యూడో, క్యారమ్స్​, టేబుల్ టెన్నిస్​ లాంటి ఇండోర్ గేమ్స్​ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాయి.

స్టే ను బట్టి చార్జ్ 

సిటీ నుంచి 50 – 100 కిలోమీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో లేక్​ వ్యూ క్యాంపింగ్ ​ఫెసిలిటీస్​ఉన్న రిసార్ట్స్​ ఉన్నాయి. వికారాబాద్ ​అనంతగిరి హిల్స్​, మోమీన్​పేట్, గండిపేట​ తదితర ప్రాంతాల్లో డ్రాప్​ జోన్​, వైల్డ్​నెస్​, వైల్డర్​ నెస్ ​రీట్రీట్​రిసార్ట్స్, పెంగ్విన్​ లేక్​ వ్యూ క్యాంపింగ్​పేర్లతో వివిధ రిసార్ట్స్​ఉన్నాయి. రిసార్ట్స్, ఫెసిలిటీస్​ను బట్టి రేట్లు ఉంటున్నాయి. సాయంత్రం 3, 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు రిసార్ట్స్​లో స్టే చేయొచ్చు. ఇందుకు ఒక్కొక్కరికి 1,200 నుంచి 6,000  దాకా చార్జ్ చేస్తున్నారు. స్మాల్ ​టెంట్స్​, స్మాల్​ ట్యూబ్ ​రూమ్స్, కంటెయినర్ క్యాబిన్లు ఇలా రకరకాలు క్యాంపింగ్స్​ఫెసిలిటీస్, ఫుడ్​ను బట్టి రేట్లు ఉంటున్నాయి.  

రెస్పాన్స్ బాగుంది 

లేక్​వ్యూ క్యాంపింగ్ కు​రెస్పాన్స్​బాగుంది. ఎక్కువగా ఫ్యామిలీస్​గా వస్తుంటారు. పిల్లలతో కలిసి ఇండోర్, అవుట్​డోర్​గేమ్స్​ఆడుతూ ఎంజాయ్​చేస్తుంటారు. యూత్, ఎంప్లాయీస్​కూడా అధికంగానే విజిట్ చేస్తున్నారు.        

-  ఓ రిసార్ట్ నిర్వాహకుడు

మళ్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నం 

వీకెండ్​ఎంజాయ్ చేసేందుకు సిటీలో కాకుండా అవుటింగ్ వెళ్దామని ఫ్రెండ్స్ తో కలిసి వికారాబాద్​లోని ఓ రిసార్ట్ కు వెళ్లాం. మ్యూజిక్​నైట్, మార్నింగ్​ట్రెక్కింగ్​చాలా థ్రిల్లింగ్​గా అనిపించింది. రెండు రోజులు చెట్లు, గుట్టలతో నిండిన ప్రకృతితో హాయిగా తిరిగాం. మరిచిపోలేని మూమెంట్స్ అవి. మళ్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాం.          
- శ్రీకాంత్, ప్రైవేట్​ఎంప్లాయ్, సీతాఫల్​మండీ