రాజ్యసభకు ‘సిటిజన్’ బిల్లు.. బలాబలాలు ఎంతెంత?

రాజ్యసభకు ‘సిటిజన్’ బిల్లు.. బలాబలాలు ఎంతెంత?

న్యూఢిల్లీ: ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సిటిజన్ షిప్ సవరణ బిల్లును కేంద్రం రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టనుంది. 124 నుంచి 130 మధ్య ఓట్లు తమకు వస్తాయని బీజేపీ అంచనావేస్తోంది. రాజ్యసభలో 240 మంది సభ్యులున్నారు. బిల్లు పాస్ కావడానికి 121 మంది సభ్యులు అవసరం అవుతుంది. లోక్ సభలో టీఆర్ఎస్ ఈ బిల్లును వ్యతిరేకించింది. రాజ్యసభలోనూ ఆపార్టీ అదే స్టాండ్ తీసుకుంటుందని తేలడంతో ప్రతిపక్ష కూటమిలో ఆనందం వెల్లివిరుస్తోంది. టీఆర్ఎస్‌కు రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. శివసేన కూడా బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి . బీజేపీకి రాజ్యసభలో 83 మంది బలం ఉంది. మిత్రపక్షాలైన ఏఐడీఏడీఎంకే‌కి11 మంది, జేడీయూకి ఆరుగురు, శిరోమణి అకాలీదళ్‌కు ముగ్గురు సభ్యులున్నారు. బీజేడీకి చెందిన ఏడుగురు ఎంపీలు, టీడీపీ, వైసీపీకి చెందిన ఇద్దరేసి సభ్యులు కూడా బిల్లుకు మద్దతు ఇస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆపార్టీ నాయకులుతో బీజేపీ హైకమాండ్ మాట్లాడినట్టు వార్తలొచ్చాయి.