సిగాచీ బాధితులకు పరిహారం చెల్లించండి : సీఐటీయూ

సిగాచీ బాధితులకు పరిహారం చెల్లించండి : సీఐటీయూ
  • సీఐటీయూ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: సిగాచీ పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం  ప్రకటించిన కోటి పరిహారం ఇంత వరకు అందలేదని సీఐటీయూ డిమాండ్​ చేసింది. ఘటన జరిగి వంద రోజులు అవుతున్నా పరిహారం ఇవ్వలేదని.. వెంటనే చెల్లించాలంటూ మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కార్యాలయం మందు సీఐటీయూ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 

అనంతరం జాయింట్‌‌‌‌ లేబర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌కు వినతి పత్రం అందచేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించి ఇప్పటివరకు రూ. 25 లక్షలు మాత్రమే బాధిత కుటుంబాలకు అందజేశారని విమర్శించారు. గాయపడిన క్షతగాత్రులకు పూర్తి పరిహారం ఇవ్వాలని, కార్మికులకు పెండింగ్‌‌‌‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు.