మేడారం డ్యూటీ చేసిన ఆశాలకు టీఏ, డీఏ ఇవ్వాలి : చింత నాగమణి

మేడారం డ్యూటీ చేసిన ఆశాలకు టీఏ, డీఏ ఇవ్వాలి :  చింత నాగమణి

ములుగు (మేడారం), వెలుగు : మేడారం జాతరలో డ్యూటీ చేసిన ఆశా వర్కర్లకు రోజుకు రూ.750 చొప్పున టీఏ, డీఏ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు చింత నాగమణి కోరారు. ఈ మేరకు శనివారం మేడారంలో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ మేడారం జాతరను సక్సెస్‌‌ చేయడంతో తమ పాత్ర కూడా ఉందన్నారు. 

గత ప్రభుత్వం పారితోషికాల పేరుతో తమ శ్రమను దోచుకుందని, ప్రస్తుత ప్రభుత్వమైనా పారితోషికాల పద్ధతిని రద్దు చేసి రూ. 18 వేల శాలరీ చెల్లించాలని కోరారు. హెల్త్‌‌ కార్డులు, ప్రమాద బీమాతో పాటు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్‌‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్‌‌రెడ్డితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారని నాగమణి తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి ప్రభావతి, సభ్యులు చంద్రావతి, అమరావతి, అనిత, వజ్ర, సత్యవతి, సుజాత, నాగమణి, విజయ, సరిత, యశోధ పాల్గొన్నారు.