104 ఉద్యోగులను రెగ్యులర్ చేయండి

104 ఉద్యోగులను  రెగ్యులర్ చేయండి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రాష్ట్రంలో104 ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని జిల్లా కలెక్టరేట్ ముందు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేశారు.

 అనంతరం రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్​రెడ్డికి వినతిపత్రం అందించారు.  కార్యక్రమంలో 104 ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శివకుమార్, మాధవి, రేణుక, మల్లేష్, విష్ణు పాల్గొన్నారు.