
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటికల నెరవేర్చడమే లక్ష్యంగా సీఐటీయూ పోరాడుతోందని ఆ యూనియన్ మందమర్రి ఏరియా ప్రెసిడెంట్ ఎస్.వెంకటస్వామి అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్‌లోని సీఐటీయూ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. సొంతింటి పథకం,పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, మారుపేర్ల సవరణ తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండేండ్లు గడిచినా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఇప్పటి వరకు ఏ సమస్యలను పరిష్కరించలేదన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ‘సొంతిల్లు కావాలా..క్వార్టర్ కావాలా’ అనే డిమాండ్‌తో ఈనెల 11,12 తేదీల్లో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో నిర్వహించే బ్యాలెట్ఓటింగ్లో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. సింగరేణికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరం లాభాల్లో కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఏరియా జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ రామగిరి రామస్వామి, లీడర్లు రమేశ్, సంజీవరెడ్డి, సురేశ్, మల్లేశ్, కుమారస్వామి, తాజోద్దిన్, శ్రీధర్, ఆదర్శ్ పాల్గొన్నారు.