
హైదరాబాద్: డ్రగ్స్, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. తదపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. కేటీఆర్ డ్రగ్స్‌కు అంబాసిడర్లా మారాడంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశాడు. పరువు నష్టం కింద తనకు కోటి రూపాయలు చెల్లించాలని కేటీఆర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు.. డ్రగ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది.