స్టాలిన్ సీక్రెట్ అడిగిన మహిళ.. సిగ్గుపడుతూ చెప్పిన సీఎం

V6 Velugu Posted on Sep 21, 2021

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మార్నింగ్ వాక్‌లో ఓ సరదగా సంఘటన ఎదురైంది. ఆయన వాకింగ్ చేస్తుండగా ఎదురైన కొందరు ప్రజలతో ఆయన ఆగి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనను ఓ మహిళ అడిగి ప్రశ్నకు సిగ్గుపడుతూ నవ్వేసి.. మెల్లిగా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను డీఎంకే పార్టీ తన అధికారిక ట్విట్టర్‌‌ పేజీలో షేర్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.

ఈ రోజు (మంగళవారం) ఉదయం సీఎం స్టాలిన్ చెన్నైలోని అడయార్ ఏరియాలో వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఎదురైన ప్రజలతో ఆయన మాట్లాడుతుండగా.. వాళ్లంతా డీఎంకే పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటూ ఓ సరదా ప్రశ్న వేసింది. మీరు 68 ఏండ్ల వయసులోనూ ఇలా యంగ్‌గా, ఫిట్‌గా ఎలా ఉన్నారని అడింది. ఈ యూత్‌ఫుల్‌ లుక్ వెనుక సీక్రెట్ ఏంటని ప్రశ్నించింది. దీంతో ఆయన ఒక్కసారిగా సిగ్గుపడుతూ నవ్వేసి.. ‘‘డైట్‌ కంట్రోల్‌ వల్లే” అంటూ స్టాలిన్ సమాధానం చెప్పారు.

Read More:

వైట్ ఛాలెంజ్ ప్రకంపనలు.. అసలు దీని హిస్టరీ ఏంటి?

ఆర్మీ హెలికాప్టర్ కూలి.. ఇద్దరి మృతి

ఆ స్వామీజీది హత్యా? ఆత్మహత్యా?

పుట్టిన రోజున గుడికెళ్లిన దళిత బాలుడికి 23 వేలు జరిమానా

Tagged Chief Minister, viral, morning walk, MK stalin, Blush

Latest Videos

Subscribe Now

More News