పుట్టిన రోజున గుడికెళ్లిన దళిత బాలుడికి 23 వేలు ఫైన్

పుట్టిన రోజున గుడికెళ్లిన దళిత బాలుడికి 23 వేలు ఫైన్

కొప్పల్: నిమ్న కులానికి చెందిన వారనే కారణంతో ఓ కుటుంబాన్ని హనుమాన్ గుడికి రానివ్వలేదు. ఈ ఘటన కర్నాటకలోని కొప్పల్ జిల్లా, మియాపురా గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగుజూసిన ఈ ఘటనలో ఓ వ్యక్తి తన పిల్లాడ్ని తీసుకొని ఆంజనేయ ఆలయానికి వెళ్లాడు. పిల్లాడి పుట్టిన రోజు కావడంతో హనుమంతుడి ఆశీస్సులు పొందేందుకు దర్శనానికి వెళ్లారు. అయితే ఆ ఆలయంలో దళితుల ప్రవేశంపై నిషేధం ఉందనే విషయాన్ని అతడు మర్చిపోయాడు. కానీ పిల్లాడు మాత్రం దేవుడ్ని ప్రార్థించుకోవడానికి ఆలయంలోకి పరిగెత్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన అగ్రకులానికి చెందిన కొందరు ఆలయ మెంబర్లు ఈ విషయంపై పంచాయితీ పెట్టారు. 

దళిత బాలుడు గుడిలో అడుగు పెట్టడం వల్ల ఆలయం అపవిత్రం అయిపోయిందని, ఆలయ శుద్ధీకరణ కోసం పిల్లాడి పేరెంట్స్ రూ.23 వేలు పరిహారం చెల్లించాలని తీర్మానించారు. ఈ విషయం జిల్లా పాలనా యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. పోలీసులతోపాటు రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ శాఖల అధికారులను ఆ గ్రామానికి పంపారు. అలా గ్రామానికి చేరుకున్న అఫీషియల్స్.. అస్పృశ్యతపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. దళిత పిల్లాడి కుటుంబానికి ఫైన్ వేసిన వారిపై సీరియస్ అయిన అధికారులు.. మరోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

Read More:

వైట్ ఛాలెంజ్ ప్రకంపనలు.. అసలు దీని హిస్టరీ ఏంటి?

వైరల్ వీడియో: స్టాలిన్ సీక్రెట్ అడిగిన మహిళ.. సిగ్గుపడుతూ చెప్పిన సీఎం

ఆర్మీ హెలికాప్టర్ కూలి.. ఇద్దరి మృతి

ఆ స్వామీజీది హత్యా? ఆత్మహత్యా?