సీఎంఆర్ తరలింపునకు ప్రయార్టీ

సీఎంఆర్ తరలింపునకు ప్రయార్టీ
  • రోజువారి పర్యవేక్షణ అవసరం
  • కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​

నిజామాబాద్, వెలుగు: కస్టమ్​ మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్)​ సేకరించడంపై దృష్టి పెట్టాలని సివిల్​ సప్లయ్​ మినిస్టర్ ​ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్లతో వీసీ నిర్వహించి రివ్యూ చేశారు. డిసెంబర్​నాటికి గడువు ముగిసినా ఎఫ్​సీఐకి చేరాల్సిన సీఎంఆర్​ఇంకా మిల్లర్ల వద్ద ఉందని, అందుకే ఈ నెల 21 వరకు గడువు ఇచ్చామని, ఈ ఛాన్స్​ను మిల్లర్లు ఉపయోగించుకోవాలన్నారు. సంబంధిత అధికారులు మిల్లర్ల నుంచి బియ్యం వచ్చేలా రోజువారీ పర్యవేక్షణ చేయాలన్నారు.

మిల్లర్లు​ సీఎంఆర్​ వడ్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ రీసైక్లింగ్​ దందా జరగడానికి వీలులేదన్నారు. ప్రజాపాలనలో వచ్చిన 4,76,321 దరఖాస్తులలో ఇప్పటిదాకా 1,49,953 అప్లికేషన్లను ఆన్​లైన్​లో నమోదు చేశామని, మిగతా వాటిని ఈనెల 17 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. అడిషనల్​కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి పాల్గొన్నారు.