ట్రాన్స్ పోర్ట్ టెండర్లలో గోల్ మాల్!

ట్రాన్స్ పోర్ట్  టెండర్లలో గోల్ మాల్!

గద్వాల, వెలుగు : సివిల్  సప్లై ఆధ్వర్యంలో జరిగిన స్టేజి–2 ట్రాన్స్ ఫోర్ట్  టెండర్లలో గోల్ మాల్  జరిగినట్లు కొందరు కాంట్రాక్టర్లు ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని రేషన్  షాపులకు బియ్యం సప్లై చేసే టెండర్లకు సివిల్  సప్లై ఆఫీసర్లు నోటిఫికేషన్  ఇచ్చారు. టెండర్లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. టెండర్ లో పాల్గొనాలంటే మూడు సొంత వెహికల్స్ తో పాటు రెండు లీజు వెహికల్స్, రెండు చిన్న వెహికల్స్  ఉండాలి. ఆన్ లైన్ లో రెండు పార్టీలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఒక పార్టీకి చెందిన కాంట్రాక్టర్  ఒరిజినల్  ఆర్సీలు పెట్టలేదని మరో పార్టీకి చెందిన కాంట్రాక్టర్  అబ్జెక్షన్  చెప్పారు.

మరో కాంట్రాక్టర్  సైతం ఒకే వెహికల్  నెంబర్ పై రెండు, మూడు చోట్ల టెండర్  వేశారని అభ్యంతరం తెలిపారు. దీంతో టెండర్లను హోల్డ్ లో పెట్టారు. రెంటు పార్టీలకు చెందిన వారు తమకే టెండర్లు దక్కాలని ఆఫీసర్ల పై  ఒత్తిడి తెచ్చారు. చివరికి మంగళవారం టెండర్లను పాత కాంట్రాక్టర్ కు వచ్చేలా ఫైనల్  చేశారనే ఆరోపణలున్నాయి. ఒకే వెహికల్  నెంబర్ పై రెండు, మూడు చోట్ల టెండర్  వేసిన వారికి ఎలా ఫైనల్  చేస్తారని పలువురు కాంట్రాక్టర్లు ప్రశ్నించారు.

కిలోమీటర్​కు రూ.31 వేసిన టెండర్లను కాదని, రూ.33 కోట్​ చేసిన వారికి టెండర్  ఫైనల్  చేసి ఆఫీసర్లు పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ఇదిలాఉంటే రూల్స్​ ప్రకారం టెక్నికల్  బిడ్ లో క్వాలిఫై అయిన వారికే టెండర్లు ఇచ్చినట్లు సివిల్​ సప్లై డీఎం విమల తెలిపారు.