సివిల్స్ ప్రిపరేషన్ స్పెషల్..

సివిల్స్ ప్రిపరేషన్ స్పెషల్..

యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 2న జరగనుంది. ఈ 15 రోజుల సమయం ప్రిపరేషన్‌ లో చాలా కీలకం. అభ్యర్థి చాలా ప్రశాంతంగా ఉండటం ప్రధానం. పరీక్షలో ‘చదివినవి వస్తాయా’ అన్న ఆతృత, ఫలితం మీద కన్నా రివిజన్‌, చివరి నిమిషపు వ్యూహం మీద, పకడ్భందీ ప్రణాళిక మీద దృష్టి పెట్టడం ముఖ్యం.

1. రివిజన్‌ : ఈ దశలో కొత్తకొత్త అంశాలను చదివే ప్రయత్నంచేయవద్దు.  కొన్ని నెలలుగా మీరు చదివినవే నెమరు వేయండి. ‘అది చదివానా, ఇది చదవలేదా’ అంటూ టెన్షన్ పడకండి. మీ చేతిరాతతో రాసుకున్న మెటీరియల్‌ ని మరోసారి తిరగేయండి.

2. ప్రధాన అంశాలు: ఈ పది రోజుల్లో సిలబస్‌ మొత్తాన్ని రివిజన్‌‌ చేయడం కష్టం. అందుకని కీలకమైన అంశాలను మాత్రమే చదవాలి. అంతకంటే సమయం లేదని గుర్తించాలి. అనవసరంగా టెన్షన్ పడితే ప్రయోజనం లేదు. భారత జాతీయోద్యమం, భారత
రాజ్యాంగం , భారత భౌగోళిక అంశాలు, శాస్త్ర సాంకేతిక రంగాల మౌలిక విషయాలు, సమకాలీన సవాళ్లు, ఆర్థిక రంగంలో వస్తున్న పరిణామాలు, చరిత్ర–సంస్కృతి లాంటి వాటిని ప్రధాన అంశాలుగా గుర్తించి వాటిని తుది దశ రివిజన్ కు కేటాయించుకోవాలి.

3. కరెంట్ ఎఫైర్స్: సివిల్​ సర్వీసెస్​ పరీక్షకు అత్యం త కీ లకమైన విభాగం  సమకాలీన అంశాలు. ఏడాదిగా జరిగిన రాజకీయ, సాంఘిక, ఆర్థిక, శాస్త్ర సాం కేతిక, భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి. వీటిని ఈ పది రోజుల్లో పునశ్చరణ చేసు కోవడం ప్రధానం. Aspirational Districts, Transgender issues, Cauvery water dispute, Election Commission, VVPAT, EVM, Delhi Mumbai Industrial Corridor, Zika Virus, Sentinelese Tribes… ఇలా కరెంట్‌ ఎఫైర్స్‌ విభాగంలో ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. వీటిని విడిచిపెట్టకుం డా ప్రిపేరవ్వాలి. ప్రతినెలా జరిగే సంఘటనలన్నింటినీ అనేక వెబ్‌ సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి. వాటిని ఒక క్రమంలో అమర్చు కొని ఒక్క సంఘటనని కూడా విడిచి పెట్టకుండా చదవాలి.

4. ప్రభుత్వ పథకాలు: ప్రిలిమినరీ పరీక్షలో అత్యంత ప్రధానమైనవి – భారత ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలు. Pradhan
Mantri Kisan Samman Nidhi, Pradhan Mantri Shram Yogi Mandhan, Rashtriya Kamadhenu Aayog, Ayushman Bharat, Deendayal Antyodaya yojana, Smart cities Mission, Swaccha Bharath Mission, Pradhan Mantri Awas Yojana, Ujjwal Discom Assurance Yojana .. ఇలాంటి ఎన్నో పథకాలున్నాయి . అన్నింటినీ తెలుసుకోండి. ఏడాది కాలంలో ప్రవేశ పెట్టిన పథకాల గురించిన సవివర సమాచారాన్ని రివైజ్‌ చేసుకోండి.

5. వార్త వెనుక రహస్యం: కరెంట్‌ ఎఫైర్స్‌ లో కేవలం ఆయా సంఘటనల్ని చదివితే సరిపోదు. persons, Places, Awards,
Games, Sports… ఇలా అన్నింటినీ కవర్‌‌ చేయాలి. అంతే కాదు. ఆయా అంశాల వెనుక ఉన్న విభాగాల్ని సైతం చదవాలి.
ఒక సంఘటన ఏమిటి, ఎందుకు జరిగింది, దాని పర్యవసానాలు ఏమిటి, ఎలా ఎక్కడ జరిగింది, ఇతర రంగాలలో దాని ప్రభావం
ఏమిటి? ఇలా ఒకదానితో మరొకటి ముడిపెట్టుకుంటూ చదవాలి. ఉదాహరణకు ఈ సంవత్సరం రిపబ్లిక్‌ డేకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా విచ్చేశారు. దీనిని కింది విధంగా సకల విషయాలతో ముడిపెడుతూ చదవాలి. బ్లూ ఎకానమీ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ బ్రిక్స్

6. ప్రభుత్వ మంత్రిత్వశాఖలు: దేశంలో వివిధ రంగాలలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవ్వాలంటే ఏదో ఒక్క శాఖ చేతిలో ఉండదు.
కేం ద్ర ప్రభుత్వం లో Agriculture, Home, Industries, Civil Aviation, Comm unications, Culture, Defence, Information Technology, Health and Family Welfare…ఇలా వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆయా శాఖల పని తీరు, లక్ష్యాలు, ఆయా శాఖల్లోని విభాగాలు, అనుబంధ సంస్థలు, ఇలా అనేకానేక అంశాలను చదవాలి.

7. చట్టాలు: ప్రభుత్వం వివిధ చట్టాలను రూపొందిస్తూ ఉంటుంది. వాటి విశేషాలను తప్పకుండా మననం చేయండి. కొన్ని బిల్లుల స్థాయిలో మిగిలిపోయి చట్టాలుగా రూపొందని అంశాలు కూడా ఉంటాయి. ఇటీవల పౌరసత్వ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ టాంటివి ఇందుకు ఉదాహరణలు. ఇలాంటివి తప్పకచదవాలి రాజ్యాంగ సవరణ బిల్లుల గురించి తప్పక అర్థం చేసుకోవాలి.

8. నివేదికలు: అనేక అంశాలపై సర్కారు ఆయా కమిటీలను నియమిస్తూ ఉంటుంది. ఆయా సంఘాల వివరాలు, వాటి నివేదికలు, అందులోని విశేషాలు, వాస్తవాలు, ఫలితాలు సవివరంగా తెలుసుకోవాలి. Kelkar Committee, Renke Commission, Idate Commission, Benerjee Commission, Sarkaria Commission, Srikrishna Commisssion, Thakkar Commission – ఇలా ఎన్నెన్నో కమిటీల వివరాలను తప్పక చదవండి.

9. అంతర్జా తీయ సంస్థలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక సంస్థలు వివరాలు తెలియాలి. అయితే ఇటీవలి కాలంలో వార్తల్లో
కెక్కిన సంస్థలే కాకుండా ప్రపంచ చరిత్ర గతిని మారుస్తున్న అంతర్జా తీయ సంస్థల విశేషాలు చదవాలి. India–Brazil–South Africa Forum, Indian Ocean Rim Association, BRICS, New Development Bank, International Monetory
Fund, Asia Pacific Economic Cooperation, Organisation for Economic Cooperation and Development (OECD) మొదలైన వాటి వివరాలు తెలుసుకోండి.

10. చెక్‌ లిస్ట్‌‌: ఏయే అంశాలను మరిచిపోకుండా చదవాలో వాటిని ఇప్పటికే ఒక జాబితాగా తయారు చేసుకోవాలి, ముఖ్యంగా కరెంట్‌ ఎఫైర్స్‌ ఆధారంగా జనరల్‌ స్టడీస్‌ లోని అంశాల్ని ఒక లిస్ట్‌‌గా రూపొందించుకొని ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా చదవాలి. యుద్ధానికి ఎన్ని రోజుల ముందు నుంచి సన్నద్ధమవుతున్నా సమర సమయంలో ఎంత సిద్ధంగా ఉన్నా మన్నదే విజయాన్ని నిర్ణయిస్తది. కాబట్టి ఈ పది రోజులు ప్రశాంతంగా, మైనంగా తదేక దీక్షతో ధ్యానం చేస్తూ ప్రిపరేషన్‌‌‌‌పైనే దృష్టి పెట్టి
సాగండి విజయం మీదే..                                                                                                        ఆకెళ్ల రాఘవేంద్ర

                                                                                                                             ఈ–గురుకులమ్ ఫర్ ఐఏఎస్