సెల్‌‌ఫోన్‌‌లో కేసుల విచారణా?

సెల్‌‌ఫోన్‌‌లో కేసుల విచారణా?
  • లాయర్లపై సీజేఐ బెంచ్‌‌ అసంతృప్తి

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్‌‌లో కేసుల విచారణ కు సెల్‌‌ఫోన్‌‌ వినియోగిస్తున్న లాయర్ల పై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ జరుగుతున్నపుడు లాయర్ల వైపు నుంచి పదేపదే ఇంటరప్షన్‌‌ ఏర్పడడంతో బెంచ్‌‌ ఈ కామెంట్లు చేసింది. ఇదే రిపీట్ అయితే మొబైల్‌‌ ద్వారా విచారణకు హాజరుకావడాన్ని బ్యాన్‌‌ చేస్తమని హెచ్చరించింది. ఇంటరప్షన్ ఏర్పడడంతో సోమవా రం 10 కేసుల విచారణను వాయిదా వేశారు. దీంతో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్‌‌ హిమా కోహ్లిల బెంచ్‌‌ అసహనం వ్యక్తం చేసింది. ‘‘మొబైల్​తో విచారణకు హాజరవుతున్నారు. సుప్రీంకోర్టులో ఆన్‌‌లైన్‌‌ విచారణకు రెగ్యులర్‌‌‌‌గా అటెండ్ అవుతున్నారు. ఇందుకోసం ఓ డెస్క్‌‌టాప్‌‌ ఏర్పాటు చేసుకోలేరా’’ అని బెంచ్ కామెంట్ చేసింది.