రోశయ్య మృతి తెలుగు వారికి తీరని లోటు

రోశయ్య మృతి తెలుగు వారికి తీరని లోటు

కొణిజేటి రోశయ్య మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పరిపాలనా దక్షుడిగా రోశయ్య పేరు పొందారన్నారు. ఆయన మృతి తెలుగు వారికి తీరని లోటన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని రోశయ్య కోరుకునేవారని చెప్పారు. 

 రాజకీయాల్లో అత్యున్నత విలువలు కలిగిన వ్యక్తిని కోల్పోవడం బాధకరమని అన్నారు. క్రమశిక్షణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి, గవర్నర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న ఏ రోజు హద్దు మీరి వ్యవహరించలేదని.. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా కళలు, సాహిత్యంపై అభిమానం ఉన్న వ్యక్తన్నారు. రోశయ్య సేవలు మరువలేనివని, అన్ని పదవులకు వన్నె తీసుకువచ్చారన్నారు. అర్ధశతాబ్ధానికిపైగా రోశయ్య ప్రజలకు సేవలందించారని గుర్తుచేసుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.