లైవ్​ స్ట్రీమింగ్​పై సీజేఐదే నిర్ణయం

లైవ్​ స్ట్రీమింగ్​పై సీజేఐదే నిర్ణయం

లైవ్​ స్ట్రీమింగ్​పై సీజేఐదే నిర్ణయం
జ్యుడీషియల్​ ఆర్డర్​కు సుప్రీం నో

న్యూఢిల్లీ: జాతీయ, రాజ్యాంగ పరమైన ప్రాధాన్యం ఉన్న కేసులను లైవ్​ స్ట్రీమింగ్​ చేయాలన్న 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంపై సీజేఐ నిర్ణయం తీసు కుంటారని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్​ స్పష్టంచేసింది. అడ్మినిస్ట్రేషన్​పై సుప్రీంకోర్టుకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఈ విషయంలో సీజేఐనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

లైవ్​ స్ట్రీమింగ్​పై జ్యుడీషియల్​ ఆర్డర్​ జారీచేసేందుకు న్యాయమూర్తి జస్టిస్​ అరుణ్​ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్​ నిరాకరించింది. ఈ విషయంలో సీజేఐ అడ్మినిస్ట్రేటివ్​ సైడ్​ నుంచి నిర్ణయం తీసుకోవడమే సరైనదని పేర్కొంది. ఏఎస్‌జీ మాధ వి దివాన్.. 2018 నాటి తీర్పు అమ లు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైం దని బెంచ్​కు తెలియజేశారు.

మరిన్ని వార్తల కోసం..