కొట్టుకున్న బీజేపీ, తృణమూల్ విద్యార్థి సంఘాలు

కొట్టుకున్న బీజేపీ, తృణమూల్ విద్యార్థి సంఘాలు

వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్షం భారతీయ జనతాపార్టీల మధ్య వైరం మరింత ముదురుతోంది. కొన్నాళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఆరోపణలు, బెదిరింపుల స్టేజీ దాటి.. నాయకుల పర్యటనలను అడ్డుకోవడం, అరెస్టుల వరకు వెళ్లింది. డాక్టర్ల సమ్మెతో.. కొద్దిరోజుల పాటు రాజకీయ రగడ సద్దుమణిగింది. ఐతే.. శుక్రవారం రోజున హౌరా జిల్లా అమ్టా పట్టణంలో బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్- ABVP, టీఎంసీ విద్యార్థి విభాగం తృణమూల్ ఛాత్ర్ పరిషత్-TMCP నాయకులు కాలేజీలో కొట్టుకున్నారు. దీంతో.. కాలేజీలో ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. ఇవాళ రెండు పార్టీల సంఘాల నేతలు కాలేజీ ప్రాంగణంలో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.