రసాభాసగా మారిన లింగోజిగూడ,చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశం

రసాభాసగా మారిన లింగోజిగూడ,చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశం

ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్, చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.  లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, టీపీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్  స్టేజీపై ఉండగానే  ఎల్బీనగర్ నియోజకవర్గం నాయకుల మధ్య వర్గ పోరు బయటపడింది.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో  లింగోజిగూడ,చంపాపేట్ డివిజన్ 5వేల నుంచి 6 వేల మధ్యలో మాత్రమే ఓట్లు వచ్చాయంటూ జెక్కిడి ప్రభాకర్ లేవనెత్తడంపై, లింగోజిగూడ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువు వర్గాల మధ్య మాటమాట పెరిగి వివాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో గొడవ పెద్దది కావడం,  వివాదం సద్దుమనకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సునీత మహేందర్ రెడ్డి, మధు యాష్కి  వెళ్లిపోయారు.