నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పెండింగ్ వేతనాలు చెల్లించాలి : ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పెండింగ్ వేతనాలు చెల్లించాలి : ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అయిదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట రెండో రోజు నిరసన వ్యక్తం చేశారు.  పెండింగ్ జీతాలు ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం శూన్యమన్నారు.  

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని లేనిపక్షంలో పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు.  జీతాలు సరైన టైమ్ కు రాకపోవడంతో కుటుంబ పోషణ అస్తవ్యస్తంగా మారిందన్నారు.