పోడు పట్టాలివ్వాలని డిమాండ్.. అధికారులు, గిరిజనులకు మధ్య తోపులాట

పోడు పట్టాలివ్వాలని డిమాండ్.. అధికారులు, గిరిజనులకు మధ్య తోపులాట

పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. గిరిజనులు అడవిని చదును చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం బంజేపల్లి శివారులోని మర్రితండా, నెమలి గుట్ట తండాకు చెందిన గిరిజనులు తమకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ అటవీ భూమిని దున్నేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్​ అధికారులు వారిని వారించారు. 

ఈ క్రమంలో తండా వాసులకు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. అకస్మాత్తు పరిణామంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లను అటవీ అధికారులు సీజ్​ చేశారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు భారీగా మోహరించారు.