విద్యార్థుల మధ్య హిజాబ్ వివాదం.. పరీక్షలు రద్దు

విద్యార్థుల మధ్య హిజాబ్ వివాదం.. పరీక్షలు రద్దు

కొద్ది రోజుల క్రితం కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమబెంగాల్‭ రాష్ట్రాన్ని తాకింది. మంగళవారం ఉదయం హౌరాలోని ధులాగోరిలో ఉన్న ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో ఇంటర్​ సెకండియర్​ చదువుతున్న పలువురు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. తమను తరగతి గదిలోకి అనుమతించాలని పాఠశాల నిర్వాహకులను కోరారు. హిజాబ్ ధరించిన పలువురు విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించినప్పుడు.. కాషాయ కండువాలతో తమను కూడా అనుమతించాలని వారు డిమాండ్​ చేశారు. 

ఈక్రమంలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఘటనలో ఫర్నీచర్​ ధ్వంసమైంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న 11, 12వ తరగతుల పరీక్షలను విద్యాసంస్థ యాజమాన్యం రద్దు చేసింది. స్కూల్ యూనిఫాంతో వస్తేనే తరగతి గదిలోకి విద్యార్థులకు అనుమతి ఇస్తామని యాజమాన్యం వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‭ను సంఘటనా స్థలానికి పంపించారు.