
హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినారె(సింగిరెడ్డి నారాయణ రెడ్డి) 94వ జయంతి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. సినారె ఫోటోస్, పోస్టర్స్ పెట్టలేదని వివాదానికి దిగారు ఆయన అభిమానులు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ కు, సినారె అభిమానులకి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కోసం తోపులాటకు దారి తీసింది. ఒకరినొకరు గల్లాలు పట్టుకోవడంతో తోపులాట జరిగింది. ఒకరినొకరు దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ తోపులాటలో ప్రసన్న కుమార్, పాశం యాదగిరి మీద దాడి జరిగినట్లు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్ లో ఆంధ్ర వాళ్ళు ఉండడంతోనే తెలంగాణకు చెందిన సినారెను పట్టించుకోవడం లేదంటూ సినారె అభిమానులు ఆందోళనకు దిగారు. దీనిపైన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సినారెకు సీఎం నివాళి
తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి, సారస్వత శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గేయ రచయితగా, నవలాకారుడిగా, పద్యకవిగా సాహిత్య రంగంలోనే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా వారు అనేక సామాజిక సేవలు అందించారని ఆయనను గుర్తుచేసుకున్నారు రేవంత్.