భారీ వర్షాలు.. విల్లా, కాలనీవాసుల మధ్య లొల్లి

భారీ వర్షాలు.. విల్లా, కాలనీవాసుల మధ్య లొల్లి

భారీ వర్షాలు, వరద ఓ వివాదాదానికి కారణమైంది. కుత్బుల్లాపూర్ లోని మల్లంపేట PVR మెడోస్ విల్లా వాసులు, సమీప కాలనీల జనం మధ్య గొడవలు జరుగుతున్నాయి. భారీ వర్షాలతో వస్తోన్న వరదనీటిలో చుట్టుపక్కల కాలనీలు, బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. PVR మెడోస్ విల్లాస్ 2013 లో ఏర్పడింది. అప్పట్లో సమీపంలోని చెరువు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కబ్జాలతో ఆ చెరువు విస్తీర్ణం కాస్త 4 ఎకరాలకు చేరింది. అధికారుల నిర్లక్ష్యంతో చెరువు చుట్టుపక్కల ఇష్టానుసారంగా నిర్మాణాలు వెలిశాయి. దీంతో చెరువు సమీపంలో ఉన్న విల్లాలు పూర్తిగా డ్రైనేజీ వాటర్ నిండిపోయాయి. చెరువు ఆక్రమణకు గురికావడం వల్లే తమకి ఈపరిస్థితి వచ్చిందంటూ విల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొత్తకుంట చెరువు,  చెన్న చెరువు వరద నీటితో నిండి పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిన్న కొత్తకుంట బస్తీ వరదనీటితో నిండిపోయింది. బ్యాక్ వాటర్ వెళ్లడానికి... విల్లాకు చెందిన ఔట్ లెట్ పైపులను చెరువు ఆక్రమణ దారులు పగలగొట్టారు. దీంతో చుట్టు ప్రక్కల కాలనీల డ్రైనేజి , వరద నీరు విల్లాలను ముంచెత్తింది. దీనిపై కాలనీ వాసులు, విల్లాల్లో ఉండే వారికి గొడవ జరిగింది. డైనేజీ నీటితో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు