ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •   మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లోకి చేరికలు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వార్డు శివాజీ నగర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. సామాజిక కార్యకర్త బూర్కుల విక్రమ్​గౌడ్–-సోనీప్రియ దంపతులు, బీఆర్​ఎస్ కు చెందిన అశోక్, జంజిరాల కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్​లో చేరగా వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ప్రజా ప్రభుత్వం, మంత్రి వివేక్​వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్​లో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్​రెడ్డి, లీడర్లు గోపతి రాజయ్య, పల్లె రాజు, అబ్దుల్​అజీజ్, ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, జంగం కల, నీలం శ్రీనివాస్​గౌడ్, శ్యాంగౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి సీఎస్​ఐ చర్చిలో ప్రార్థనలు

మందమర్రిలోని సీఎస్​ఐ చర్చిలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలబ్రేషన్స్​లో మంత్రి వివేక్, కలెక్టర్​ కుమార్​ దీపక్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్​ రఘునాథ్​ రెడ్డి, మున్సిపల్​ కమిషనర్లు​తుంగపిండి రాజలింగు, గద్దె రాజు, చర్చి ఫాస్టర్లు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్​ కట్ చేసిన మంత్రి సంబురాలు ప్రారంభించారు. క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. 

నెరవేరిన కల

క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెలుగుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మున్సిపల్​ వాసుల కల నెరవేరింది. రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్​సిస్టంను బుధవారం రాత్రి మంత్రి వివేక్ ​వెంకటస్వామి ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ  వాసులు హర్షం వ్యక్తం చేశారు.