- బీజేపీతోనే సమస్యలు పరిష్కారం
- ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: బీజేపీకి ఓటు వేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రజలకు మంచి జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్‌లోని కచ్ కంటి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న స్లాటర్ హౌస్‌ను బుధవారం ఆయన దగ్గరుండి తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు 30 ఏండ్లుగా స్లాటర్ హౌస్ ఉందని, గతంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.
తాను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్లాటర్ హౌస్ తొలగించినట్లు తెలిపారు. ఏండ్లుగా ఆదిలాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మున్సిపల్ ఆఫీసర్లు, బీజేపీ నాయకులు చారి, రాము, ధోని జ్యోతి, నరేశ్, కృష్ణ, పాల్గొన్నారు.
