మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎంపీ సురేశ్షెట్కార్

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎంపీ సురేశ్షెట్కార్

నారాయణ్ ఖేడ్, వెలుగు: మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ సురేశ్​కుమార్​షెట్కార్​అన్నారు. బుధవారం ఆయన ఖేడ్ పట్టణంలో మైనార్టీ శ్మశాన వాటిక భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని ఐదెకారల విస్తీర్ణంలో మైనార్టీ శ్మశాన వాటికకు శంకుస్థాపన చేశామన్నారు. ఎంపీ నిధుల కింద కంపౌండ్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

మైనార్టీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల త్యేక నిధులు మంజూరు చేసిందని ఈ నిధులతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల ప్రక్రియ వేగవంతవుతుందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రొటోకాల్ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

చైనా మాంజా వాడొద్దు

సంక్రాంతిని పురస్కరించుకొని పతంగులు ఎగురవేసే కార్యక్రమాన్ని ఎంపీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎవరూ కూడా చైనా మాంజను వాడొద్దని, బిల్డింగ్ పైన పతంగులు ఎగరేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిత్తు షెట్కార్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అప్పారావు షెట్కార్, యువకులు పాల్గొన్నారు.