- మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలోని పోలింగ్కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. బుధవారం ఆయన మెదక్ పట్టణంలోని పదో వార్డులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలను యుద్ద ప్రాతిపదికన సిద్ధం చేయాలని, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
డాక్టర్లు సమయపాలన పాటించాలి
కౌడిపల్లి: డాక్టర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఉచిత నాణ్యమైన వైద్యం అందాలన్నారు. మందులన్నీ అందుబాటులో ఉండాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్ఎస్సీని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు.
