- పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: పటాన్‌చెరులోని మైత్రి మైదానంలో సంక్రాంతి సందర్భంగా ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పతంగులను ఎగురేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరేళ్లుగా ఎండీఆర్ ఫౌండేషన్ పటాన్చెరులో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ, కైట్‌ఫెస్టివల్ నిర్వహింస్తుండడం అభినందనీయమన్నారు.
అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్‌తో కలిసి బహుమతులు అందజేశారు. జబర్దస్త్ ఫేమ్ కొమురమ్మ, ఇతర ఆర్టిస్టులు అందరిని ఉత్సాహపరిచారు. స్టేజీపై ఎమ్మెల్యే నాయకులతో కలిసి డ్యాన్స్ చేశారు. భారతీనగర్ కార్పొరేటర్ సింధుఆదర్శ్రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, దేవేందర్‌రాజు, నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, విజయ్‌కుమార్, పట్టణ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం
అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్టపై నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ మొదటి స్లాబ్ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రూ.3 కోట్ల అంచనాతో చేపట్టిన దేవాలయ నిర్మాణ పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం పలువురు తమ విరాళాలను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, ఆలయ చైర్మన్ సుధాకర్‌యాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.
