భారతీయ సంస్కృతి గొప్పదనం చాటేలా వేదవ్యాస్‌‌‌‌ మూవీ: ఎస్వీ కృష్ణారెడ్డి

భారతీయ సంస్కృతి గొప్పదనం చాటేలా వేదవ్యాస్‌‌‌‌ మూవీ: ఎస్వీ కృష్ణారెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వేదవ్యాస్‌‌‌‌’. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హీరోగా పిడుగు విశ్వనాథ్‌‌‌‌ను పరిచయం చేశారు.  ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘విశ్వనాథ్‌‌‌‌ ఫైట్స్‌‌‌‌తో సహా ప్రతి సీన్‌‌‌‌లో అద్భుతంగా నటించాడు. తను హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనం చాటేలా ఈ చిత్రం రూపొందిస్తున్నాం’ అని చెప్పారు.  

దాదాపు ఐదారేళ్లుగా ఎస్వీ కృష్ణారెడ్డి ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై వర్క్ చేస్తున్నారని, ఇందులో ప్రతి విషయం కొత్తగా ఉండాలని తపిస్తున్నారని, అందుకే హీరోయిన్‌‌‌‌గా కొరియా అమ్మాయిని, విలన్‌‌‌‌గా మంగోలియా నటుడిని ఎంపిక చేసినట్టు అచ్చిరెడ్డి చెప్పారు.  ఇందులో తాను వేద నారాయణ అనే పాత్ర పోషిస్తున్నానని, చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు కొడుకు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవడం సంతోషంగా ఉందని సాయికుమార్‌‌‌‌‌‌‌‌ అన్నారు. హీరో విశ్వనాథ్, పిడుగు సుబ్బారావు పాల్గొన్నారు.