
పది ఫలితాల్లో సిటీ ఫేట్ మారడం లేదు. ఈ సారి ఎలాగైనా మంచి స్థానం సంపాదించుకోవాలని కష్టపడినా ఫలితం దక్కలేదు. పరీక్షలకు 70,173 మంది అటెండ్ కాగా 58,306 మంది పాస్ అయ్యారు. గత ఏడాది సాధించిన 76 శాతం కంటే అదనంగా 7 శాతం ఉత్తీర్ణులైనా 31వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఒక్క గణితంలోనే 13,772 మంది ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంఖ్య 738 ఉండగా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 6,901 మంది ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన స్టూడెంట్స్ లో ఇద్దరు 10/10 జీపీఏ సాధించారు. మేడ్చల్ జిల్లా 92.98 శాతంతో 21వ ప్లేస్ సాధించగా రంగారెడ్డి జిల్లా 92.83% ఉత్తీర్ణతతో 22వ స్థానంలో నిలిచింది.
పదో తరగతి ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో హైదరాబాద్ 31 స్థానంలో నిలిచింది. కానీ గతేడాది 76 శాతం ఉత్తీర్ణతతో పోల్చితే 7 శాతం స్టూడెంట్స్ ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. జిల్లా పరిధిలోని 25 ప్రభుత్వ స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. జిల్లాలో మొత్తం 70,173 మంది పరీక్షలకు హాజరవగా, వీరిలో 58,306 మంది పాస్ అయ్యారు. ఇందులో 87.14శాతంతో బాలికలు సత్తా చాటగా, బాలురు 78.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా రెగ్యులర్ 306, ప్రైవేటు 57 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 34,517 మంది బాయ్స్, 35,656 మంది గర్ల్స్ పరీక్షలు రాశారు. వీరిలో 27,237 మంది బాయ్స్, 31,069 మంది గర్ల్స్ ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ మేనేజ్‍మెంట్ స్కూల్స్ లో 8 ఆపై జీపీఏని 1,251 మంది స్టూడెంట్స్ సాధించడం గమనార్హం. మ్యాథ్స్ లో ప్రభుత్వ పాఠశాలల్లో 738 మంది, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 6,901 మంది స్టూడెంట్స్ ఫెయిలయ్యారు. అలాగే జనరల్ సైన్స్ లో 497 మంది ప్రభుత్వ స్కూల్, 5636 మంది ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు.
ఇద్దరికి 10 జీపీఏ….
సికింద్రాబాద్ లాలాపేట్‍లోని మార్కెట్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్స్ కు చెందిన తలసీల లక్ష్మి, బొల్లారం ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్‍కు చెందిన మదాసు శ్రావ్య 10/10 జీపీఏ సాధించారు. అలాగే మాదన్నపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎం.భరద్వాజ్, మలక్‍పేట్ గవర్నమెంట్ స్కూల్స్ కు చెందిన కుప్పల విష్ణువర్ధన్, ఉప్పనూతల అనిల్, కుల్సుంపురా ప్రభుత్వ స్కూల్‍కు చెందిన నిఖిల్ ఖాదిగేఖర్, కాచిగూడ స్కూల్‍లో చదివే గౌని సింధూజ, హైదర్‍గూడ గవర్నమెంట్ స్కూల్‍కు చెందిన అంజలి గుప్తా, హిమాయత్ నగర్‍కు చెందిన నమ్‍వాడి అవినాష్, హిల్‍స్ట్రీట్ ప్రభుత్వ స్కూల్‍కు చెందిన సీహెచ్ పవన్ కుమార్‍లు 9.8 జీపీఏ సాధించారు. వీరిని డీఈఓ వెంకటనర్సమ్మ, మారేడ్‍పల్లి డిప్యూటీ డీఈఓ అభినందించారు.
ప్రైవేట్‍లో 83 శాతం ఉత్తీర్ణత….
ప్రైవేట్ పాఠశాలల్లో 83.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. నగరంలోని పలు ప్రైవేట్ స్కూల్స్ కు చెందిన 63,311 మంది స్టూడెంట్స్ టెన్త్ ఎగ్జామ్స్ కు అటెంట్ అయ్యారు. ఇందులో 52,598 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 24 స్కూల్స్ లో 40శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది.
మండలాల వారీగా ఉత్తీర్ణత…..
మండలం పేరు మొత్తం విద్యార్థులు ఫెయిల్ పాస్ శాతం
అమీర్‍పేట్ 186 21 165 88.71
బహదూర్‍పురా 764 132 632 82.72
బండ్లగూడ 551 83 468 84.94
చార్మినార్ 433 106 327 75.52
గోల్కొండ 1252 322 930 74.28
హిమాయత్ నగర్ 456 47 409 89.69
ఖైరతాబాద్ 1061 155 906 85.39
మారేడ్‍పల్లి 661 90 571 86.38
ముషీరాబాద్ 320 36 284 88.75
నాంపల్లి 419 97 22 76.85
సైదాబాద్ 420 44 376 89.52
సికింద్రాబాద్ 490 64 426 86.94
మొత్తం 7013 1197 5816 82.93