భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

తెలంగాణలో పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్ల లపై అసంతృప్తి, ఎమ్మెల్యేలతో విభేదాలు, వ్యక్తిగత కారణాలు లాంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీలోనూ  అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు.

భూపాలపల్లి మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20మంది కౌన్సిలర్లు చైర్మన్ వెంకట్ రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు జిల్లా లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ దివాకర్ కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీరిపై కౌన్సిలర్లు పలు ఆరోపణలు చేశారు.