ఆన్లైన్లో క్లాసులు.. ఫీజు కోసం ఫోన్లు

ఆన్లైన్లో క్లాసులు.. ఫీజు కోసం ఫోన్లు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎడ్యుకేషన్ అందిస్తామంటూ కొన్ని స్కూల్స్ అప్పుడే అకడమిక్ ఇయర్ స్టార్ చేశాయి. ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, రూల్స్ బ్రేక్ చేసి ఆన్లైన్కాస్లు కండక్ట్ చేస్తున్నాయి. సిలబస్ మొదలు పెట్టామని.. స్టూడెంట్స్ లెసెన్స్ వినాలంటే ఫీజు పే చేయాలని చెప్తుండడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

కండీషన్స్ అప్లయ్..

సిటీకి చెందిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ మేలోనే అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేసింది. ఓ యాప్ క్రియేట్ చేసి ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టిన స్టూడెంట్స్కి లాగిన్ ఐడీ, పాస్ట్ వర్డ్ ఇస్తామని కండీషన్ పెట్టింది. పే చేసిన స్టూడెంట్స్ కి మాత్రమే క్లాసెస్ చెప్పడం, హోమ్ వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఫీజు లేట్ అయిన స్టూడెంట్స్కు మిస్ అయిన క్లాస్లు కావాలంటే అదనంగా 10 శాతం ఫీజు వసూలు చేస్తోంది. పిల్లల చదువు కోసమని ఆ మొత్తమూ కట్టినా మిస్అయిన క్లాసెస్ కి సంబంధించి రెస్పాన్స్ ఉండటం లేదని పేరెంట్స్ చెబుతున్నారు. మేనేజ్మెంట్ను నిలదీస్తే సిలబస్ రిపీట్ చేయలేమని చెప్తున్నారని వాపోయారు. ఇలా పలు స్కూల్స్ తమ స్కూల్ పేరుతో యాప్ క్రియేట్ చేసి.. లెసెన్స్ పీడీఎప్, వీడియోలు, అసైన్ మెంట్, ప్రాజెక్ట్లను అందులోనే అప్ లోడ్ చేస్తున్నాయి. ఫీజు పే చేసిన స్టూడెంట్స్కి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తున్నాయి. ఇన్ టైమ్లో ఫీజు కట్టని వారు క్లాసెస్ కి దూరమవుతున్నారు.

పర్మిషన్ లేకున్నా..

లాక్ డౌన్ ఎఫెక్ట్తో స్టూడెంట్స్ లాస్ట్ అకడమిక్ ఇయర్ లో సిలబస్ మిస్ అవకుండా కొన్ని స్కూల్స్ మార్చిలో ఆన్ లైన్ క్లాసులు చెప్పాయి. కొన్ని రోజులకు ప్రభు త్వం అన్ని తరగతుల స్టూడెంట్స్ను ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ చేసింది. ఈ నెల 12 నుంచి కొత్త అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్గా చెప్పుకొంటున్న కొన్ని మాత్రం నెలన్నర ముందే అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేశాయి.

ఇన్ స్టాల్ మెంట్ లో కట్టమంటున్రు

మా అమ్మాయి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 8వ క్లాస్ చదువుతోంది. ఈ నెల 12 నుంచి ఆన్ లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఫస్ట్ టర్మ్ ఫీజు లక్షా91వేలు పే చేయాలని మేనేజ్మెంట్ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అమౌంట్ కష్టమని చెప్తే మంత్లీ ఇన్ స్టాల్ మెంట్ బేసిస్ లో కట్టొచ్చన్నారు. కృష్ణరాజు, పేరెంట్, జూబ్లీహిల్స్

గవర్నమెంట్ చెప్పినా ఫీజు పెంచిన్రు

ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్ అని చెప్తే మా పాపను ఓ స్కూల్ లో జాయిన్ చేశాం. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతోంది. సమ్మర్లోనే అకడమిక్ ఇయర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టమన్నారు. ఫీజు కూడా పెంచారు. లాస్ట్ ఇయర్ ఫీజే తీసుకోవాలని గవర్నమెంట్ చెప్పింది కదా అని ప్రశ్నిస్తే, హెడ్డాఫీస్ డెసిషన్ అంటున్నారు. ఫీజు లేట్ అవడంతో అప్పటికే కంప్లీట్ అయిన క్లాసెస్ యాప్లో ఎక్స్పైర్ అయ్యాయని, ఈ నెల 8 నుంచి మళ్లీ చెప్తామని అన్నారు. ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. శివాజీ రాజేశ్వరి, పేరెంట్, కర్మన్ ఘాట్

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన‌ వ్యక్తి అరెస్టు