తెలంగాణ భాష క్లాసిక్

తెలంగాణ భాష క్లాసిక్
  • తెలుగులో మాట్లాడటం నాకిష్టం 

  • సమాజానికి కొత్తదనాన్ని అందించడం మన బాధ్యత

  • గవర్నర్ తమిళి సై సౌందర రాజన్

హైదరాబాద్: తెలంగాణ భాష క్లాసిక్ అని, తెలుగులో మాట్లాడుతున్నప్పుడు తనకు ఆనందాన్ని కలిగిస్తుందని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. సమాజానికి కొత్తదనాన్ని అందించడం మన బాధ్యత. మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. సామాన్యులకు అందేలా చిన్న పుస్తకాలు ముద్రించాలి. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలి’ అని గవర్నర్​అన్నారు