సజీవ దహనానికి సిద్ధం: మంత్రి పొన్నం

సజీవ దహనానికి సిద్ధం:  మంత్రి పొన్నం
  • బండి సంజయ్.. నేను అనని మాటలను తప్పుగా ప్రచారం చేస్తవా
  • అమ్మ ప్రస్తావన తెచ్చి ఇప్పుడెమో కాళ్లు మొక్కుతా అంటవా
  • మంత్రి పొన్నం ప్రభాకర్

వేములవాడ: -రాముని జన్మభూమి ఎక్కడని తాను అనని మాటలను బండి సంజయ్ తప్పుగా ప్రచారం చేస్తున్నాడని, -ఒక వేళ అన్నానని నిరూపిస్తే సజీవ దహనానికి తాను సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. హుస్నాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద - అమ్మ ప్రస్తావన తీసుకొచ్చి ఇప్పుడేమో మళ్లీ కాళ్లు మొక్కుతా అంటున్నవా అని ఫైర్​అయ్యారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ప్రభాకర్​మాట్లాడుతూ ‘నేను హిందువుని. మాంసాహారం కూడా తినను. మందు తాగను. రాజన్న గుడికి నీవు ఏం చేశావ్ బండి సంజయ్..- ఏనాడూ అయిన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకున్నామా?- ఎన్నికల్లో ఓట్ల కోసం పెండ్లాం మంగళ సూత్రాలు అమ్ముకున్న నీవు ఇలా మాట్లాడుతావా.-- ఎంపీగా గెలిస్తే నన్ను రాజీనామా చేస్తావా అంటావా సిగ్గు ఉందా?  300 మంది పోలీసులతో యాత్ర చేస్తున్నావ్? నువ్వెప్పుడూ మతపరమైన అంశాలతో రాజకీయం చేస్తున్నావ్ అని ఫైర్​అయ్యారు.